Mahaa Daily Exclusive

  మంత్రి కోమటిరెడ్డికి సీఎం ఫోన్ ట్రిపుల్ ఆర్ కు టెండర్లపై హర్షం

Share

తెలంగాణ ప్రాంతంలో గేమ్ ఛేంజర్ గా పిలవబడుతున్న ట్రిపుల్ఆర్ పనులకు మోక్షం లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యాపీగా ఉన్నారు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎ రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆదివారం ఉదయం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని సీఎం అభినందించారు. మీ కృషి సహకారంతో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు పట్టాలెక్కిందని కోమటిరెడ్డిని అభినందించారు. 2017లో ఆగిపోయిన ప్రాజెక్టు మీ సహకారంతో కేవలం ఏడాదిలో సాధ్యమైందని తెలిపారు . ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 161 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టును 5 ప్యాకేజీలు విభజించారు. ప్రాజెక్టు అంచనా వ్యయం 7, 104 కోట్ల రూపాయలు. వచ్చేఏడాది ఫిబ్రవరి 15న బిడ్ దాఖలు చేసుకోవచ్చు. రెండు రోజుల తర్వాత వాటిని తెరవడం, ఆపై ఆమోదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక, సాంకేతిక విభాగాల్లో ఈ బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దక్షిణ భాగంపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

Latest