ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు క్యాబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక మధ్యాహ్నం జిందాల్ సంస్థ ప్రతినిధులతో ఆయన భేటీ కావొచ్చని సమాచారం. చెత్త నుంచి ఇంధనాన్ని సృష్టించే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై వారితో ఆయన చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Post Views: 67







