న్యూఢిల్లీ: ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టాయిలెట్‌లోకి వెళ్లి సర్వీస్ గన్‌తో కాల్చుకుని మృతిచెందాడు. గుజరాత్‌లోని సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. జైపూర్‌కు చెందిన సీఐఎస్‌ఎఫ్ జవాన్‌గా సూరత్ ఎయిర్ పోర్టులో విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎయిర్‌పోర్ట్‌లోని టాయిలెట్‌కు వెళ్లాడు. సర్వీస్ రైఫిల్‌తో పొట్టలో కాల్చుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఇది గమనించిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే అతడని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ జవాన్ అప్పటికే మృతిచెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 38






