Mahaa Daily Exclusive

  నయాగఢ్‌ అడవుల్లో అరుదైన నల్ల చిరుత సోషల్ మీడియాలో వీడియో వైరల్

Share

ఒడిశా: నయాగఢ్‌ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్‌ చిరుతపులి సంచరిస్తోంది. నోట్లో కూనను పట్టుకుని తిరుగుతున్న ఆ నల్ల చిరుత కెమెరాకు చిక్కింది. ఈ మేరకు సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు. అడవిలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో ఆ చిరుతపులి కదలికలను గుర్తించామని తెలిపారు. దానితోపాటు ఓ పిల్ల కూడా ఉందని చెప్పారు. ఇది ఈ ప్రాంత అద్భుతమైన జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని వారు పేర్కొన్నారు. పర్యావరణ వ్యవస్థకు నల్ల చిరుతలు చాలా ముఖ్యమని వివరించారు. వాటి ఆవాసాలను రక్షించడమనేది అభివృద్ధి చెందుతున్న వన్యప్రాణుల వారసత్వాన్ని నిర్ధారించడమవుతుందని చెప్పారు.

Latest