ముంబై : ప్రముఖ అణు శాస్త్రవేత్త డా. రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. 88 ఏళ్ల వయసు ఉన్న ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబై జస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజగోపాల చిదంబరం మృతి పట్ల శాస్త్రవేత్తలతోపాటు పలు రంగాల ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. కాగా, అణు శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను ప్రారంభించిన చిదంబరం… పొఖ్రాన్-1(1975), పొఖ్రాన్-2(1998) అణు పరీక్షల్లో కీలకపాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్‌కు చైర్మన్‌గా, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెక్రటరీగా కూడా ఆయన సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాజగోపాలకు పద్మవిభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందించింది.






