చెన్నై: తమిళనాడులో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. విరుధునగర్ జిల్లా సత్తూర్ సమీపంలో ఉన్న పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. సమీపంలోని పలు ఇండ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Views: 71






