భీమిలి, మహా: నియోజకవర్గంలోని తగరపువలసలో ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఏఎన్ఎన్ శాటిలైట్ ఛానల్, జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలను 1వ వార్డు జనసేన అధ్యక్షురాలు పరిమి భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పోటీలకు భీమిలి జనసేన ఇంచార్జి పంచకర్ల సందీప్, టీడీపీ ఇంచార్జి కోరాడ రాజబాబులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. కోలాటాల మధ్య వారికి స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున మహిళలు ముగ్గులు వేసేందుకు ఆశక్తి చూపించారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయలు మరుగున పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో జనసేన తరపున సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ముగ్గుల పోటీలు, కోలాటాలు నిర్వహించడం సంతోషకర విషయమన్నారు. మహిళల భద్రతే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని గుర్తుచేశారు. తగరపు వలసలో మహిళలకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సరే జనసేన పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. వెంటనే ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. అనంతరం రాజబాబు మాట్లాడుతూ గతంలో సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలు, సంస్కృతి, సంప్రదాయాలతో చేసుకొనేవారని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అలాంటి వాతావరణంను మళ్లీ తగారపువలసలో తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. రానున్న రోజుల్లో ఆ పథకం అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొనేందుకు వచ్చిన మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు , ప్రత్యేక ఆహ్వనితురాలు కన్నా హేమ దుర్గతోపాటు తదితరులు పాల్గొన్నారు.





