ఏపీ: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ దుర్మరణం చెందారు. సంగం మండలం వెంగారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ భార్యను ఆసుపత్రిలో తరలించారు. చికిత్సపొందుతూ ఆమె మృతిచెందిందంటూ పోలీసులు తెలిపారు. ఆటోలో ఉన్న మరికొందరికీ స్వల్ప గాయాలయ్యాయి. కాగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వారు పేర్కొన్నారు.
Post Views: 57








