ఏపీ: వైసీపీ హయాంలో పోలవరం విధ్వంసానికి గురైందంటూ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పోలవరం నిర్వాసితుల అకౌంట్లో డబ్బులను జమ చేసిందని ఆయన పేర్కొన్నారు. కానీ, జగన్ హయాంలో మాత్రం వారికి మొండి చేయి చూపారన్నారు. జగన్ పాదయాత్ర చేసినప్పుడు వారికి న్యాయం చేస్తామంటూ, వారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామంటూ హామీ ఇచ్చారని, కానీ, వైసీపీ హయాంలో వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. పోలవరాన్ని కేంద్ర సహాయంతో నిర్దేశిత సమయంలో పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
Post Views: 58






