మహా
ఏదో ఒకరోజు తమిళనాడుకు సీఎం కావాలన్నది తన కల అని ప్రముఖ సినీనటి త్రిష సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల త్రిష మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సామాజిక సమస్యలపై పోరాడుతూ ప్రజాసేవ చేయాలన్నది తన ఆలోచన అని ఈ ఇంటర్వ్యూలో త్రిష వెల్లడించింది. ఇలా చేయాలంటే కేవలం రాజకీయాల వల్లే సాధ్యమని ఆమె అభిప్రాయపడింది. తనకు రాజకీయాల్లోకి వెళ్ళాలన్న ఆసక్తి ఉందని తెలిపిన త్రిష ఏదో ఒక రోజు తమిళనాడుకు సీఎం కావాలన్నది తన కోరిక అని తెలిపింది. త్రిష కామెంట్స్ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె విజయ్ పార్టీలో చేరుతారా? అన్నాడిఎంకెలో చేరుతారా? అన్నది చూడాలి.
Post Views: 112







