Mahaa Daily Exclusive

  కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా…!

Share

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవితోపాటు లిబరల్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అయితే, కీలకమైనటువంటి జాతీయ కాకస్ సమావేశం బుధవారం జరగనున్నది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో చర్చనీయాంశమైంది. కాగా, అక్టోబర్ లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై సర్వే చేసిన పలు సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న లిబరల్స్ పార్టీ ఘోరపరాజయం పాలుకున్నదంటూ స్పష్టం చేశాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ సైతం కవ్వింపు చర్యలకు కాలుదువ్వుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ట్రూడో రాజీనామా చేసి ఉండొచ్చని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest