Mahaa Daily Exclusive

  తిరుపతి ఘటన పట్ల పొన్నం, మహేశ్ కుమార్ దిగ్భ్రాంతి…!

Share

తిరుపతిలో తొక్కిసలాటలో భక్తుల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతిచెందిన కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తిరుపతిలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని, భక్తులు ఎవరూ అధైర్యపడవద్దంటూ ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్ లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా సంబంధిత అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.

Latest