తిరుపతి ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘తిరుపతి వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందిన ఘటన దిగ్భ్రాంతికరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో పాటుగా పాలకమండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించాలని కోరాను’ అంటూ ఆయన పేర్కొన్నారు.
Post Views: 51








