Mahaa Daily Exclusive

  తిరుపతిలో భక్తుల మృతి బాధాకరం గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలి -మాజీ మంత్రి హరీశ్ రావు

Share

ఏపీలోని తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మృతిచెందడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘తిరుపతి ఘటన దురదృష్టకరం. ఇప్పటివరకు ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు ఆరుగురు భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. మృతిచెందిన భక్తుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు జాగ్రతలు పాటించాలి’ అంటూ హరీశ్ రావు పేర్కొన్నారు.

Latest