Mahaa Daily Exclusive

  తిరుమలలో కల్లోలం గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం…!

Share

తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలోని విష్ణు నివాసం వద్ద దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. టోకెన్ల కోసం ఒక్కసారిగా భక్తులు రావడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో తమిళనాడులోని సేలంకు చెందిన భక్తురాలితోపాటు మరో ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో నలుగురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. గురువారం, డిసెంబర్ 9 తెల్లవారుజాము నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. దీంతో బుధవారం సాయంత్రం నుంచే భక్తులు బారులు తీరారు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్లలో బారులు తీరారు. అయితే అధిక సంఖ్యలో భక్తులు భారీగా రావడంతో క్యూలైన్లలో తోపులాట జరిగింది. దీంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా గురువారం నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీకి టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయితే, టోకెన్ల కోసం బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు ఒకరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించేందుకు మెయిన్ గేట్ ఓపెన్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున దూసుకు రావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. జనవరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొదటి మూడు రోజులకు గానూ 1.20 లక్షల టోకెన్లను గురువారం ఉదయం జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లలో టికెట్ల జారీ టీటీడీ ఏర్పాట్లు చేసింది.

Latest