Mahaa Daily Exclusive

  మెప్మా ఆర్పీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి…!

Share

మెప్మా ఆర్పీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ కడప జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. శనివారం ఎస్టీయూ కార్యాలయంలో మెప్మా ఆర్పీల సమావేశం కళావతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసీ బాదుల్లా మాట్లాడుతూ 16 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించి, రూ. 26 వేలు కనీన వేతనం నేరుగా బ్యాంకు అకౌంట్‌ల్లో జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ ప్రగతి, బీఎల్ఓ డ్యూటీలు, మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించడం, స్త్రీ నిధి ఇలా అనేక రకాల పనులు ప్రభుత్వం మెప్మా ఆర్సీలతో చేయిస్తుందన్నారు. ఆర్పీలకు 2019లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యూలర్‌ను రద్దు చేయాలని, ఏ కారణంతోనైనా మృతిచెందిన ఆర్పీలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల వేతనాలు తక్షణమే విడుదల చేయాలని, చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షలు సుబ్బారాయుడు, ఆర్పీలు బీబీ, శ్రీదేవి, విజయలక్ష్మి, ఇందిర తదితరులు పాల్గొన్నారు.

Latest