ఏపీఎండీసీ కార్మిక సంఘాల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓబులవారిపల్లె మండలం ముక్క వారిపల్లెలోని కుడా చైర్మన్ కార్యాలయంలో ఏపీఎండీసీ కార్మిక సంఘాల సమస్యలపై సంబంధిత అధికారులు, కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత తొమ్మిది రోజులుగా ఏపీఎండీసీ కార్మిక సంఘాలు తమ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేయడం జరుగుతుందన్నారు. వారి సమస్యలపై ఏపీఎండీసి మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, గనుల శాఖ మంత్రితో సంప్రదించి జనవరి 25 లోపల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని కార్మిక సంఘాలకు మంత్రి హామీ ఇచ్చారు. దీంతో వారు తాత్కాలికంగా సమ్మె విరమించారు. ఇందులో ముఖ్యంగా ఏపీఎండీసీ కార్మికులను రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ కార్మికులకు పే స్కేల్స్ కేటాయించాలని, ప్రమోషన్లు కల్పించాలని, సీఎండీ టెండర్ ను ఆపాలని, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ సమ్మె చేయడం జరుగుతుందన్నారు. ఈ సమస్యలన్నీ 25 లోపల పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు తాత్కాలికంగా సమ్మె విరమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎండీసీ కార్మిక సంఘాలు, తదితరులు పాల్గొన్నారు







