Mahaa Daily Exclusive

  అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న జగన్ దంపతులు, పార్టీలకతీతంగా తరలివచ్చిన నేతలు…!

Share

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి, యువనేత డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి అంతక్రియలు పూర్తయ్యాయి. అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బెంగుళూరు నుంచి పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైయస్ భారతీలు కుటుంబ సభ్యులను పరామర్శించి పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన అభిషేక్ పార్థివదేహాన్ని చూసి, తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అనంతరం అభిషేక్ కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యుల్ని ఆయన ఓదార్చారు. అనంతరం అయన నివాసం నుంచి సమాధుల తోట వరకు నిర్వహించిన అంతిమయాత్రలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి అంతక్రియలో పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, సుధీర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులు, పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి, కమలాపురం టిడిపి నేత పుత్తా నరసింహారెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Latest