Mahaa Daily Exclusive

  జ‌న‌తా ఆటో యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ కాంగ్రెస్ లో చేరిన‌ యూనియ‌న్ నాయ‌కులు, డ్రైవ‌ర్లు కండువాలు క‌ప్పి స్వాగ‌తం ప‌లికిన కంది శ్రీ‌నివాస రెడ్డి …!

Share

జ‌న‌తా ఆటో యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ సంఖ్య‌లో కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు వ‌స్తున్న ఆటో డ్రైవ‌ర్ల‌కు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా డైట్ కాలేజి మైదానం నుండి పెద్ద సంఖ్య‌లో ఆటోల‌తో ప్ర‌జా సేవాభ‌వ‌న్ వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించారు. ఖాకీ చొక్కా ధ‌రించి కంది శ్రీ‌నివాస రెడ్డి డైట్ గ్రౌండ్ నుండి క‌లెక్ట‌ర్ చౌక్ వ‌ర‌కు ఆటో న‌డిపారు. అనంత‌రం శ్రేణులు ఆటో యూనియ‌న్ నాయ‌కుల‌తో క‌లిసి త‌న క్యాంపు కార్యాల‌యం వ‌ర‌కు పాద‌యాత్రగా వ‌చ్చారు. ఆ త‌ర్వాత క్యాంపు కార్యాల‌యంలో వారంద‌రికీ కండువాలు క‌ప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇంత పెద్ద ఎత్తున ఆటో యూనియ‌న్ నాయ‌కులు, డ్రైవ‌ర్లు కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ఆనందంగా ఉంద‌న్నారు. అంద‌రి చేరిక‌తో కాంగ్రెస్ పార్టీ మ‌రింత బ‌లోపేత‌మ‌వుతుంద‌న్నారు. పాత, కొత్త నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంతా క‌లిసి పార్టీ కోసం ప‌ని చేయాల‌న్నారు. రానున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌లో స‌త్తా చాటాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీ చేసే ప్ర‌తీ అభ్య‌ర్ధిని అత్య‌ధిక మెజారిటీతో గెలిపించుకోవాల‌ని కోరారు. కార్య‌క్ర‌మంలో ఆటో యూనియన్ నాయకులు నుస్రత్ ఖాన్, జహీర్ రంజాని, బండారి సతీష్, ఆవుల వెంకన్న, కిజార్ పాషా, శంకరయ్య, లోక ప్రవీణ్ రెడ్డి, షాకాత్, ఆశన్న, బూర్ల శంకరయ్య,అల్చెట్టి నాగన్న, దాసరి ఆశన్న, బత్తుల శ్రీనివాస్, బండి సుదర్శన్, దీపక్ రావు, గంగన్న, ప్రకాష్, అల్లాబకష్రాజా లింగన్న, ఎల్మ రామ్ రెడ్డి, మానే శంకర్, ఎంఏ కయ్యుమ్, అఫ్రోజ్ అహ్మద్, ఖలీల్, నదీమ్, తలా చౌష్, అంజా, మహమూద్, అహ్మద్, తిప్పిరెడ్డి విట్టల్ రెడ్డి, అశోక్, రమేష్, జ‌నతా యూనియన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Latest