Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి…!

Share

బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసుపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులను వెంట తీసుకొచ్చి మరీ కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేశారు అన్నారు.

BRS అంటేనే B – RSS అని అర్థం…కాంగ్రెస్ పార్టీపై దేశంలో బీజేపీ ఏం ఆరోపణలు చేస్తుందో అవే ఆరోపణలు తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ చేస్తోందన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాకు నీతులు నేర్పించాల్సిన అవసరం లేదు అని తేల్చిచెప్పారు రేవంత్.