Mahaa Daily Exclusive

  పవన్ కు వర్మ బిగ్ షాక్…!

Share

పీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ టీడీపీ వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొస్తోంది. కూటమి ఒప్పందం మేరకు డిప్యూటీ సీఎం గా పవన్ కు మాత్రమే అవకాశం కల్పించారు. పవన్ కొంత కాలంగా ప్రభుత్వం పైన తెస్తున్న ఒత్తిడి .. చేస్తున్న డిమాండ్స్ తో టీడీపీ ఆలోచనలో మార్పు కనిపిస్తోంది. కౌంటర్ గా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఆ పార్టీ నేతలు చేస్తున్నారు. ఈ సమయంలోనే పిఠాపురంలో పవన్ గెలుపుకు సహకరించిన వర్మ కీలక వ్యాఖ్యలు చేసారు.

లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి పైన టీడీపీ నేతల నుంచి డిమాండ్ పెరుగుతోంది. కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన వేళ ఆయన సమక్షంలోనే పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి ఇదే డిమాండ్ చేసారు. దీనికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు పిఠాపురం నేత వర్మ సైతం లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని డిమాండ్ చేశారు. ఎవరి పార్టీ కార్యకర్తల మనోభా వాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఓడిన జగన్ బయటకు వస్తే ఇప్పటికీ ఆ పార్టీ కేడర్ సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అదే విధంగా పవన్ ను సైతం ఆయన అభిమానులు సీఎం అంటూ పిలుస్తారని గుర్తు చేసారు.