Mahaa Daily Exclusive

  యూఎస్ చరిత్రలో ఇది ఫస్టైమ్ అట్టహాసంగా ట్రంప్ ప్రమాణస్వీకారోత్సం…!

Share

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. అయితే, ఈసారి మాత్రం ప్రత్యేక సన్నివేశం చోటు చేసుకుంది. గత అధ్యక్షులు బిల్ క్లింటన్, బుష్, బరాక్ ఒబామా, జోబైడెన్ తోపాటు యూఎస్ కు చెందిన పలు రంగాల ప్రముఖులు, ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పలువురు ప్రముఖులు ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఇలా విదేశీ ప్రముఖులు హాజరడం ఇదే మొదటిసారి అని అక్కడి రికార్డులు చెబుతున్నాయి. దీంతో మరోసారి ట్రంప్ తన మార్క్ ను చూపించుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంతోపాటు పలు వ్యాపారాలు చేస్తూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ట్రంప్ ఎవరూ ఊహించని విధంగా మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జోబైడెన్ చేతిలో ఓటమిని చవిచూసి, 2024లో జరిగిన ఎన్నికల్లో మరోసారి యూఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన విషయం తెలిసిందే. యావత్ ప్రపంచం ఆసక్తి తిలకించేలా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించాలని ట్రంప్ టీమ్ నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర దేశాలకు చెందిన ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. దీంతో ట్రంప్ ప్రోగ్రెస్ కార్డులో మరో మార్క్ వచ్చి చేరినట్టయ్యింది.

హాజరైనది వీరే…
చైనా వైస్ ప్రెసిడెంట్ హన్ జెంగ్, ఇటాలియన్ ప్రధాని జియోర్గియా మెలోనీ, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యూయల్ మార్కన్, అర్జెంటినా ప్రెసిడెంట్ జావియెర్ మిలేవీ, పారుగ్యుయన్ ప్రెసిడెంట్ సాన్టిగో పెనా, ఏక్యోరియన్ ప్రెసిడెంట్ డానియల్ నోబో, భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తోపాటు టెక్ దగ్గజ కంపెనీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈఓ మార్కు జుకర్ బర్గ్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టిక్ టాక్ సీఈఓ షోజీ చ్యూ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ హాజరయ్యారు.