Mahaa Daily Exclusive

  ఏనుగులు నష్ట పరుస్తున్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ …!

Share

భామిని మండలం పాత ఘనసర గ్రామంలో ఏనుగులు నష్ట పరుస్తున్న పంటలను స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పరిశీలించారు .ఈ సందర్భంగా స్థానిక రైతులు ఏనుగుల వలన తమకు జరుగుతున్న నష్టాల్ని వివరిస్తూ ఈ ప్రాంతం నుంచి పూర్తిగా ఏనుగులను తరలించాలని డిమాండ్ చేశారు. దీంతో తక్షణమే స్పందించిన గౌరవ శాసనసభ్యులు జిల్లా అటవీ శాఖ అధికారిణి శ్రీమతి ప్రసూనతోను, జిల్లా కలక్టర్ శ్ర శ్యాం ప్రసాద్ తోనూ మరియు రాష్ట్ర అటవీ అధికారి ప్రిన్సిపాల్ చీఫ్ కన్సర్వెటర్ శ్ చిరంజీవి చౌదరితో మాట్లాడుతూ …గత ఐదు సంవత్సరాలుగా ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తూ, ప్రాణ నష్టం కలిగిస్తూ భీభత్సం కలిగిస్తున్నాయని, తక్షణమే ఏనుగులు తరలింపు చేయడానికి చర్యలు తీసుకోవాలని మరియు గత ఐదప సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పంట నష్టం విడుదల చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని అదేశించియున్నారు. రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని, ఏనుగులవలన జరుగుతున్న నష్టం పై గత ప్రభుత్వం, గత పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారన్నారు. గౌరవ ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఇక్కడ జరుగుతున్న నష్టాలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, అధికారుల వలన కాకపోతే రైతులకు వీటిని తరలించే భాద్యత అప్పగించాలని, ఎలాంటి కేసులు పెట్టినా సహించేది లేదన్నారు. గత పాలకులు రైతుల ప్రాణ, ధన రక్షణలో అశ్రద్ధ వహించడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు,బాధిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు