ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా గురువారం కడపలో మంత్రికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నగరంలోని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డిల ఆధ్వర్యంలో కార్యాలయంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ
మంత్రి నారా లోకేష్ పార్టీ కష్టకాలంలో పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని, చంద్రబాబు నాయుడు అరెస్టై జైలుకు వెళ్లిన వెళ్లిన సందర్భంలోనూ ముందుండి పార్టీని నడిపారన్నారు. అలాంటి నేత పార్టీకి ఎంతో అవసరమని రానున్న రోజుల్లోను ఆయనకు మంచి ఆయురారోగ్యాలు, మంచి రాజకీయ భవిష్యత్తు ప్రసాదించాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. మాజీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఆమీర్ బాబు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ కూడలిలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లక్ష్మిరెడ్డి కార్యాలయంలోనూ కేక్ కట్ చేసే లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ చేసిన పాదయాత్ర కారణంగా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం వచ్చిందన్నారు. దివంగత ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు నాయుడు వారసుడిగా నారా లోకేష్ లోకేష్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయన్నారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించి మంచి పాలన అందించేలా ఆశీర్వదించాలన్నారు.








