Mahaa Daily Exclusive

  అందరి సమానత్వమే “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” లక్ష్యం… – పులివెందుల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ధృవకుమార్‌రెడ్డి

Share

అందరి సమానత్వమే లక్ష్యంగా “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ధృవకుమార్‌రెడ్డి చెప్పారు.
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలరెడ్డి పిలుపు మేరకు “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” కార్యక్రమంలో భాగంగా పులివెందులలోని వివిధ కాలేజీల్లో రాజ్యాంగం గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాగంగా ఆయన మాట్లాడుతు భారత రాజ్యాంగం భారత ప్రజలమైన మనము మన భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్రదీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని ఆలోచనా భావప్రకటనా మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛను హోదాల్లోనూ అవకాశాలలోను సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతీ ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభ లో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించిందన్నారు. కానీ నేటి పాలక పార్టీలు అందుకు విరుద్ధంగా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా ముందుకెల్తున్నాయన్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకే కాంగ్రెస్ పార్టీ “జై బాపు జై భీమ్ జై సంవిధాన్” విధానంతో ముందుకెల్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పులివెందుల మండలాద్యక్షులు తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి, నాయకులు నాగరాజు,తుపల్లి రాజారెడ్డి, వినోద్ కుమార్ రెడ్డి, చందు కుమార్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.