అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురం జీఎంజీ బాలయోగి స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన కోనసీమ క్రీడోత్సవం పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా క్రీడలలో గెలుపొందిన వారికి కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు చేతులమీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. విద్యతో పాటు ఆటపాటల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
Post Views: 38








