Mahaa Daily Exclusive

  లాటరీ ద్వారా గీత ఉప కులాలకు మద్యం దుకాణాలు – జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్

Share

జిల్లాలోని గీత కులాలకు కేటాయించబడిన 14 మద్యం దుకాణాలను సంబంధిత ఉప కులాలకు లాటరీల ద్వారా పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హరిందర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ఆయన లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. జిల్లాలో గీత కులాలకు కేటాయించబడిన 14 మద్యం షాపులను లాటరీ ద్వారా గీత కుల పెద్దలు మీడియా సమక్షంలో ఆయన తీశారు.
నేరుగా లాటరీ ప్రక్రియ నిర్వహించిన జిల్లా కలెక్టర్
14 మద్యం షాప్ లను రెండు బాక్స్ లలో లాటరీ పద్ధతి ద్వారా గీత ఉప కులాలకు కేటాయిస్తున్నట్టు ప్రకటన చేశారు. లాటరీ ద్వారా ప్రకటించిన 14 షాప్ లలో గీత కుల ఉపకులాలలోని ఒకటి గౌడ, మరొకటి యాత, మిగిలిన 12 షాప్ లు శెట్టిబలిజ కులాలకు కేటాయించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరీందర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ
14 మద్యం షాపులకు ఈ నెల 27న నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. 27నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తర్వాత ఫిబ్రవరి 6న దరఖాస్తుల పరిశీలన ఉంటుందన్నారు. వచ్చేనెల 7న మద్యం షాప్ లను డ్రా పద్ధతి ద్వారా దరఖాస్తుదారులకు కేటాయిస్తారని తెలిపారు.
దరఖాస్తుదారులు రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలని,
ఒక దరఖాస్తుదారునికి ఒక మద్యం షాపు మాత్రమే కేటాయించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు ఎక్సైజ్ డిసి డి రామచంద్రమూర్తి, సూపర్డెంట్ ఆర్ ప్రసాదరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు