పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని దట్టమైన పొగ మంచు కమ్ముకుంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పొగమంచు ఉదయం 8 గంటలు అయినా మైదాన ప్రాంతంలో కూడా తగ్గలేదు.ఈ పొగ మంచు కారణంగా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు కనిపించడం లేదు .జంక్షన్ ల వద్ద వాహనాలు తప్పించుకునే సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
కానీ రైతులను మాత్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ కాలంలో రైతులు కంది ,పెసర, మినుము పంటలను వేస్తారు.అలాగే ఆ పంటలతో పాటు జీడీ ,మామిడి తోటలకు కూడా ఈ పొగ మంచు కురిస్తే పూతలు రాలిపోయే ప్రమాదం ఉంది. ఆ పంటలను రైతు నష్టపోతారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో ఏజన్సీ లో ఉండే మంచు ఈ ప్రాంతంలో కురవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మరికొందరు ఈ మంచు పడకపోవడంతో బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.ఆరోగ్య పరంగాను ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలావుండగా ఈ పొగ మంచు కొందరు చూపరులను ఆకట్టుకుంది.








