దావోస్ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు ఆయన సీఎస్, సీఎంవో అధికారులతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దిగ్గజ సంస్థల సీఈఓలు, పలు దేశాల ప్రతినిధులు త్వరలో రాష్ట్రంలో పర్యటిస్తారని సీఎం వారితో చెప్పారు. ఆ సమయంలో పెట్టుబడుల చర్చలు కార్యరూపం దాల్చేలా ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు చంద్రబాబు సూచించారు.
Post Views: 38








