కర్నూలు పట్టణం స్థానిక నంద్యాల చెక్ పోస్ట్ దేవి ఫంక్షన్ హాల్ లో పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఆధ్వర్యం లో సుప్రసిద్ధ అమర్ రాజా గ్రోత్ కారిడార్ కంపెనీ మరియు మెడ్ ప్లస్ ఫార్మా కంపెనీ లలో ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువతి,యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది.. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకొని భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఎందరో నిరుద్యోగులు నైపుణ్యం ఉండి కూడా నిష్ప్రయోజనంగా ఉండకూడదన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తుందని, ఇందులో వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
ఈ ఇంటర్వ్యూలకు భారీ ఎత్తున యువతి యువకులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమం లో ఉమ్మడి జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి,గౌరు వెంకట రెడ్డి పాణ్యం నియోజకవర్గం యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తం రెడ్డి ,కేవీఎస్ఆర్ విద్యా సంస్థల అధినేత కే వీ సుబ్బా రెడ్డి ,పుల్లయ్య ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ , వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి ,రాయలసీమ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీ రాములు ,తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్, అర్బన్ నాయకులు జనార్ధన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు








