Mahaa Daily Exclusive

  ఓటర్లు అందరూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య…!

Share

యువ ఓటర్లు తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు కావాలని, అదే విధంగా ఓటర్లు అందరూ ఓటు హక్కును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య స్పష్టం చేసారు.

శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహిస్తున్న జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, జిల్లా అధికారులు, వివిధ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. 2011వ సంవత్సరంలో మొదటి సారిగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జనవరి 25న నిర్వహించుకోవాలని క్యాబినేట్ లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఎవరి క్రింద బానిసత్వం ఉండకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశ్యంతో రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఈ రాజ్యాంగం రూపొందించడానికి ఎన్నో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహించి తయారు చేసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే వన్ బిలియన్ ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 65 శాతం ఉందని, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం ఓటింగ్ శాతం ఉందన్నారు. ఓటర్లుగా మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. స్పెషల్ సమ్మర్ రివిజన్ లో భాగంగా జనవరి 5వ తేదీన పబ్లిష్ చేశామని, దానికి ముందు డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్, ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ తయారు చేసుకోవడం జరిగిందని, ఈ స్పెషల్ క్యాంపెయిన్ ల ద్వారా యువ ఓటర్ల నమోదు చేయడం జరిగిందన్నారు. అందుకు బిఎల్ఓలు ఏర్పాటు చేసి, సదరు కార్యక్రమంపై ప్రచారం కల్పించడం జరిగిందన్నారు. యువ ఓటర్ల క్రింద తప్పనిసరిగా నమోదు చేయాలనే సదుద్దేశ్యంతో ప్రాస్పెక్టివ్ ఓటర్లుగా (భావి తరాల) 17 సం.లు దాటిన వెంటనే నమోదు చేసుకుంటే 18సం.లు పూర్తి కాగానే ఓటర్ల జాబితాలో నమోదు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అందుకు ఫామ్-6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని, ఎవరైనా చనిపోతే వారిని ఫారం-7 తొలగించడం కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసి ఎలెక్ట్రోల్ రోల్ పురిఫికేషన్ చేసుకోవడం జరుగుతుందని, అదే విధంగా ఫారం-8 ద్వారా ఓటు హక్కును ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు*

అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి మాట్లాడుతూ ఓటు అనేది చాలా పెద్ద ఆయుధం అని అన్నారు. అందుకు 18 సం.లు దాటిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు కావాలన్నారు. అదే విధంగా ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమీషనర్ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు

అంతకుముందు ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ గారి వీడియో సందేశాన్ని వినిపించారు. అనంతరం వివిధ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు జాతీయ ఓటర్ల దినోత్సవంపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

అనంతరం వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులు అతిధుల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. అదే విధంగా సీనియర్ సిటిజన్స్, విభిన్న ప్రతిభావంతుల ఓటర్లను శాలువ, జ్ఞాపికలతో సత్కరించారు*

కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవి, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమీషనర్ రవీంద్ర బాబు, ఉపాధి కల్పన అధికారి దీప్తి, ఎన్నిక విభాగ సూపరింటెండెంట్ మురళీ, జి.పుల్లయ్య, కె.వి. సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, సిఎస్సి కాలేజీ ఆఫ్ ఫార్మసీ, ఎస్టీబీసీ, ఉస్మానియా డిగ్రీ కళాశాల, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు