ఇకనుంచి ధ్రువపత్రాల కోసం ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికింది ఏపి ప్రభుత్వం…
ఉన్నచోటికే 161 ప్రభుత్వ సేవలు అందించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు!
వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదటి విడతలో ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, దేవాదాయ, ఎనర్జీ, సీఎంఆర్ఎఫ్, అన్నక్యాంటీన్, మున్సిపల్ వంటి పలు శాఖల్లో సేవలను పౌరులకు అందుబాటులోకి తెచ్చింది ఏపి ప్రభుత్వం!
|| వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్ల జారీ అవుతాయి…
ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ గురువారం నాడు వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అధికారికంగా ప్రారంభిస్తారు!!
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి!
వాట్సాప్ గవర్నెన్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వాట్సాప్ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించడానికి, పౌరులకు అవసరమైన సమాచారం అందించడం, ధ్రువపత్రాల జారీ లాంటి పలు సేవలు ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి…
వాట్సాప్ ద్వారా సేవలు అందించేందుకు గతేడాది అక్బోబర్ 22న మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తొలి విడతగా పౌరులకు 161 సేవలను కూటమి ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు సచివాలయంలో సమీక్షలో ప్రజంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను ఏ విధంగా పొందవచ్చో దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు.
పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు.
సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ని బలోపేతం చేయాలన్నారు. ఏపీని డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో అగ్రగామిగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు.








