Mahaa Daily Exclusive

  పార్టీలకు అకతీతంగా కలిసి అభివృద్ధి చేద్దాం కమలాపురం – ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి

Share

కమలాపురం నియోజకవర్గంలో పార్టీలకతీతంగా కలిసి పనిచేసే గ్రామాల అభివృద్ధికి కృషి చేద్దామని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు. వీరపునాయుని పల్లెలో సాధారణ మండల సర్వసభ్య సమావేశంలో అయన పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తమకు ఒక్కటే చెప్పారని, ఎవరిపైన కక్ష సాధింపులు వుండవని చెప్పారన్నారు. అందరికి బిల్లులు చెల్లిస్తామని చెప్పారని, మీకు కూడా బిల్లులు ఇప్పిస్తామని భరోసా ఇచ్చారన్నారు. వైసీపీ సర్పంచులు మేము పనులు చేశాము మాకు బిల్లులు ఇప్పించండని అడుగుతున్నారని, మా ప్రభుత్వంలో పేరుకే మేము సర్పంచులు, ఎంపీటీసీలమని, మాకు ఒక్క రూపాయి బిల్లులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. మాకు వచ్చిన నిధులు కూడా మాకు లేకుండా పోయాయని, అంతేకాక ఒక్క పని కూడా మాకు కాలేదంటున్నారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం శీలాఫలకాలకు ప్రారంభోత్సవం చేశామని చెప్పుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేసింది ఏమి లేదన్నారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీఎన్ఎస్ఎస్ కు రూపాకల్పన చేసినారని, తరువాతే మిగతా వచ్చిన సి ఎంలు ఆ ప్రాజెక్టు పనులు చేశారన్నారు. ఇప్పటికైన కలిసిమెలిసి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ది చేద్దామని చేద్ధామన్నారు