Mahaa Daily Exclusive

  శబాష్.. తెలంగాణ లోక్ సభ లో ప్రతిపక్ష నేత రాహుల్…!

Share

లోక్ సభ వేదికగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వ విజయాలను ప్రస్తావించారు. తెలంగాణలో జనగణనపై సర్వే నిర్వహించినట్లు తెలిపిన రాహుల్‌గాంధీ, రాష్ట్రంలో దాదాపు 90 శాతం దళితులు, గిరిజనులు, వెనుకబడినవారు, మైనారిటీలు ఉన్నారని లోక్ సభ వేదికగా వెల్లడించారు. వారి హక్కుల కోసం దేశవ్యాప్తంగా జనగనణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ విజయాలను ప్రస్తావించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ కృషికి ఫలితం దక్కినట్లయింది. రాహుల్ ప్రస్తావనతో దేశం చూపు తెలంగాణ వైపు పడగా, రేవంత్ సర్కార్ పట్టుదల, చిత్తశుద్ది మరోసారి దేశం ముందు కనబడింది. గతంలో రుణమాఫీతో సాహసానికి మారుపేరుగా నిలిచిన రేవంత్ ఇపుడు కులగణనతో నేషనల్ ట్రెండింగ్ గా మారిపోయారు. హేమాహేమీల్లాంటి రాష్ట్రాలు చేయలేని పనులు, భయపడే పనులు ముఖ్యమంత్రి రేవంత్ అలవోకగా చేస్తూ రాహుల్ ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నారు. తెలంగాణను దేశం అనుసరించాలని లోక్ సభ వేదికగా రాహుల్ కేంద్రానికి సూచించారు. ఎంతశాతం ఉంటే అంతశాతం ఫలాలు దక్కాలన్నారు.

మోడీ ఫెయిల్
మేకిన్ ఇండియా మంచి ఆలోచనే కానీ, కార్యాచరణలో మోదీ విఫలమయ్యారనేది స్పష్టంగా అర్థమవుతోందని రాహుల్ విమర్శించారు. మన దేశం ఉత్పత్తులను నిర్వహించడంలో విఫలమై, ఆ రంగాన్ని చైనాకు అప్పగించిందని వివరించారు. ఇప్పుడు పూర్తిగా ఉత్పత్తిపై దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎంతో కీలకమైన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డేటా ఆధారంగా పనిచేస్తుందనీ, అయితే ఉత్పత్తి వ్యవస్థ నుంచి వచ్చే ప్రతి ఒక్క డేటా చైనాదేనని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపించలేకపోయాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై.. దానిని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ అమెరికా పర్యటనలను రాహుల్‌ గాంధీ ప్రస్తావించారు. ట్రంప్‌ ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించేలా విదేశాంగ మంత్రి గతేడాది అమెరికా పర్యటన చేపట్టారని ఆరోపించారు. ఒకవేళ తయారీ, ఏఐ వంటి సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ఇక్కడికే వచ్చి మన ప్రధానిని ఆహ్వానించే వారని అన్నారు.