దేశ రాజధాని ఢిల్లీలో ఓటింగ్ ముగిసింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ పోటాపోటీగా తమ అంచనాలు పేర్కొంటున్నాయి. టుడే చాణక్య సర్వేలో బిజెపికి 40-45, ఆప్ కు 25-30, కాంగ్రెస్ కు 0-2 స్థానాలు వస్తాయని తేలింది. ఓటింగ్ ముగిసిన నేపథ్యంలో పలు సంస్థలను ఎగ్జిట్ పోల్స్ వివరాలను ప్రకటించాయి. ఈ సారి ఢిల్లీ పీఠం బీజేపీదేనని మెజారిటీ సంస్థల ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. జేవీసీ పోల్ బీజేపీకి 39-45, ఆమ్ ఆద్మీ పార్టీకి 32-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ బీజేపీకి 39-45, ఆప్‌కి 22-31, కాంగ్రెస్‌కు 0-2 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది. మ్యాట్రిక్స్ సంస్థ ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 0-1 వస్తాయని అంచనా వేసింది. చాణక్య స్ట్రాటజీ సర్వే ఆప్‌కు 25-28, బీజేపీకి 39,45, కాంగ్రెస్‌కు 2-3 సీట్లు వస్తాయని చెప్పింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్‌కు ఆప్‌కు 10-19, బీజేపీకి 51-60 వస్తాయని అంచనా వేసింది. పీపుల్స్ ఇన్సైట్ ఆప్‌కు 25-29, బీజేపీకి 40-44, కాంగ్రెస్‌కు 0- ఒక స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేశాయి. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఈ సారి మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్‌కు చెందిన సందీప్ దీక్షిత్, బీజేపీకి చెందిన ప్రవేశ్ వర్మ సైతం ఇదే స్థానం నుంచి బరిలోకి దిగారు.








