Mahaa Daily Exclusive

  మంత్రి అచ్చెన్నాయుడు సభలో ఉద్రిక్తత…!

Share

అచ్చెన్నాయుడు(Minister Atchennaidu) సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ(Tdp), జనసేన(Janasena) కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.

సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) పేరు ప్రస్తావించకపోవడంపై జనసేన నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో జనసేన కార్యకర్తలను టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా పవన్ కల్యాణ్ పేరు పలకరా అంటూ నిలదీశారు.

అయితే మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తేనే కూటమి అంటూ మంత్రి అచ్చెన్నాయుడు సర్ది చెప్పబోయారు. కానీ జనసేన కార్యకర్తలు వినలేదు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై సమావేశం నిర్వహించేందుకు మంత్రి అచ్చెన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా(Ambedkar Konaseema District) పి.గన్నవరం(P. Gannavaram) వెళ్లారు. జనసేన ఎమ్మెల్యే(Janasena Mla) ఆధ్వర్యంలో ఆ పార్టీ, టీడీపీ(Tdp), బీజేపీ(Bjp) కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి మంత్రి అచ్చెన్న వెళ్లిపోవడంతో కొంత సేపటికి వివాదం సర్దుమనిగింది