Mahaa Daily Exclusive

  బీఆర్ఎస్ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలి: షబ్బీర్ అలీ

Share

కులగణన సర్వే నివేదికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీఐడీ విచారణ చేపట్టాలన్నారు. ప్రజల వివరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. సర్వే పేరుతో రూ.100 కోట్లు దుర్వినియోగం చేశారని విమర్శించారు. విచారణ జరిగితే అన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.