తనకింకా షోకాజ్ నోటీసులు రాలేదని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న తెలిపారు. వచ్చినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. తీన్మార్ మల్లన్న ఎవరి ముందూ మోకరిల్లడంటూ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్ తీరు బీసీలందరికీ షోకాజ్ ఇచ్చినట్లుగా ఉంది. దేనికీ నోటీసులు? వాటిని కులగణనలో భాగమైన నాయకులకివ్వాలి. అధిష్ఠానం ఆదేశాల్ని పాటించడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. కులగణన అనేది పూర్తిగా జానారెడ్డి నివేదిక’ అని ఆరోపించారు.
Post Views: 105








