దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా చేసిన భోలే బాబా డైరీకి (రూర్కీ, ఉత్తరాఖండ్) నాడు డైరెక్టర్లుగా పనిచేసిన విపిన్ జైన్, పోమిల్ జైన్, వైష్ణవి డైరీ(పూనంబాక) సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఎఆర్ డైరీ(దుండిగల్) ఎండి రాజు రాజశేఖరన్ లను అరెస్టు చేసిన దర్యాప్తు బృందం. వీరిని తిరుపతి కోర్టులో హాజరు పరిచిన దర్యాప్తు అధికారులు. దర్యాప్తులో అక్రమాలు అనేకం బట్టబయలు అయ్యాయి. నెయ్యి సరఫరా పేరులో అడుగడుగునా ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఎఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు. ఆ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపంచినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. రూర్కీలోని భోలే బాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించింది. భోలే బాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థం లేదని సిబిఐ విచారణలో బయటపడింది. సమగ్ర విచారణతో అక్రమాలను గుర్తించిన దర్యాప్తు బృందం..మూడు డైరీలకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించింది.







