Mahaa Daily Exclusive

  మహా జామ్.. కుంభమేళాకు కోటిన్నర…!

Share

కుంభమేళాకు వెళ్లే వాహనాలతో ప్రయాగ్‌రాజ్‌ దారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాగ్‌రాజ్‌-కాన్పుర్‌, ప్రయాగ్‌రాజ్‌-లఖ్‌నవూ-ప్రతాప్‌గఢ్‌, ప్రయాగ్‌రాజ్‌-వారణాసి-మిర్జాపుర్‌, ప్రయాగ్‌రాజ్‌-రేవా వెళ్లే జాతీయ రహదారుల్లో మూడు రోజులుగా విపరీతమైన రద్దీ కొనసాగుతోంది. 48 గంటలుగా ట్రాఫిక్‌లోనే చిక్కుకున్నట్లు అనేక మంది ప్రయాణికులు పేర్కొంటున్నారు. 50 కి.మీ మేర దూరానికే 10 నుంచి 12గంటల సమయం పడుతుందని వాపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న వాహనాల రద్దీ దృష్ట్యా.. ఆదివారం నాడు మధ్యప్రదేశ్‌ పరిధిలోని అనేక జిల్లాల్లో ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడే నిలిపివేశారు.ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకే సుమారు కోటి 41లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా. దీంతో ఇప్పటివరకు మొత్తంగా 42కోట్ల మందికి పైగా ప్రయాగ్‌రాజ్‌ను దర్శించినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.