మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. వైద్య శిబిరాన్ని సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ నాగేశ్వరావు స్థానిక ప్రజా ప్రతినిధుల తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చౌటపల్లి గ్రామం నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. పరిసర గ్రామాల్లో కూడా మున్ముందు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిo చనున్నట్లు ఆయన తెలిపారు, వైద్య శిబిరానికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు,గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్యాంపు నందు న్యూరో, జనరల్ మెడిసిన్,ఎముకలు కీళ్లు మరియు చిన్నపిల్లల డాక్టర్లు పాల్గొని సుమారు 850 మందికి ఉచితంగా వైద్యాన్ని అందించి మందులు అందజేశారు ఈ క్యాంపులో డాక్టర్ చైతన్య , డాక్టర్ సీతారామ్ ,డాక్టర్ అనిల్ రెడ్డి , డాక్టర్ రాకేష్,
డాక్టర్ భార్గవి మరియు సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాయి కిరణ్ పాల్గొన్నారు.
అలాగే భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇండియన్ బ్యూరో మైన్స్ చేపట్టిన
టి.బి హరేగా దేశ్ జీతేగా కార్యక్రమంలో భాగంగా టి.బి (క్షయ వ్యాధి ) పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి సంవత్సరము ఉచితంగా క్యాంప్ నిర్వహిస్తున్న మై హోమ్ యాజమాన్యం వారికి గ్రామ ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చౌటపల్లి గ్రామ ప్రజా ప్రతినిధులు వెంకట నారాయణ, కృష్ణ వేణి నరేష్, సింగారాపు సైదులు,రాంరెడ్డి, లింగయ్య, గ్రామ కార్యదర్శి వెంకటేశ్వర్లు
పరిశ్రమ మైన్స్
ఏ.జి.యం.నరేష్ ఏ.జి.యం శ్రీనివాస్, హెల్త్ ఆఫీసర్ శ్రీను పాల్గొన్నారు.








