గిరిజనుల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ప్రసక్తే లేదని ఆయన ట్వీట్ చేశారు. ‘గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుతాం. వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాం. గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తాం. 1/70 చట్టంపై దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. అపోహలతో గిరిజనులు ఆందోళన చెందొద్దు’ అని సీఎం పేర్కొన్నారు.
Post Views: 201







