Mahaa Daily Exclusive

  మేడారం చిన్న జాతర.. రాత్రంతా జాగరణ…!

Share

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ చిన్నజాతర (మండమెలిగే)ఘనంగా ఆరంభమైంది. గతరాత్రి మేడారం, కన్నెపల్లిల నుంచి అమ్మవార్ల అడేరాలు(పూజాసామగ్రి), ఇష్ట నైవేద్యాలతో డోలి వాయిద్యాల నడుమ నృత్యం చేసుకుంటూ పూజారులు గద్దెల వద్దకు చేరుకున్నారు. పూజలు నిర్వహించి అక్కడే రాత్రంతా జాగరణ చేశారు. గురువారం ఉదయం అమ్మవార్ల అడెరాలను తిరిగి ఆలయాలకు చేర్చుతారు. శనివారం వరకు జాతర కొనసాగనుంది.