వీరఘట్టం మండలము నడుకూరు గ్రామ సమీపంలోని గురుబ్రహ్మ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు మరియు కేంద్ర సిబ్బంది అగ్నిమాపక అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేసి ప్రమాదములను అంచనా వేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రమాదముల పైన అవగాహన ఏర్పరుచుకొని ప్రమాదములలో చిక్కుకోకుండా స్వీయ రక్షణ కలిగి ఉండాలని అప్రమత్త కార్యక్రమం చేశారు. అగ్ని ప్రమాదములు ప్రాథమిక దశలోనే కార్బన్ డై ఆక్సైడ్, డ్రై కెమికల్ పౌడర్ ఎక్స్ టింగ్ విషర్ లను ఉపయోగించి నివారించ గలిగిన అధిక నష్టము వాటిల్లకుండా నిర్మూలించవచ్చునని తెలిపారు. వివిధ రకముల అగ్ని ప్రమాదములను నివారించే పద్దతులు తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు అప్పారావు పట్నాయక్, ఉపాధ్యాయులు టెర్లి సింహాచలం, మత్చ స్వప్న, భేరి శంభరమ్మ, దూసి దమయంతి, భేరి శ్రీవాణి, కె లక్ష్మి పాల్గొన్నారు.







