ఈ ఏడాదిలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు గోవింద రావు సతీమణికి జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు అందరు సేకరించిన ఒక్కరోజు గౌరవ వేతనం నగదు చెక్కు, అదేవిధంగా గత ఏడాదిలో మరణించిన హోంగార్డు శ్రీనివాస రావు సతీమణికి కారుణ్య నియామకం మేరకు హోంగార్డుగా నియమిస్తూ నియామక పత్రాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డిఐపిఎస్ గారు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు వేర్వేరుగా అందజేశారు.
సహచర హోంగార్డుల ఒక్క రోజు గౌరవ వేతనం నగదు చెక్కు అందజేత:- ఈ ఏడాది జనవరి నెలలో అనారోగ్యం వలన మరణించిన ఎం గోవిందరావు సతీమణి నాగరత్నమ్మకు జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులు అందరూ తోటి హోంగార్డు కుటుంబానికి సహాయపడాలని ముఖ్య ఉద్దేశంతో సమకూర్చిన ఒక్కరోజు గౌరవ వేతనం 4.06 లక్షల నగదు చెక్కును జిల్లా ఎస్పీ శ్రీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
హోంగార్డు గా నియమిస్తూ నియామక పత్రం అందజేత. టి.శ్రీనివాసరావు అనే హోంగార్డు శ్రీకాకుళం యూనిట్ నందు విధులు నిర్వర్తస్తూ గత ఏడాదిలో మరణించిను. ఈ మేరకు మరణించిన హోంగార్డు శ్రీనివాసరావు సతీమణి కె. ఉదయ కుమారిని శ్రీకాకుళం జిల్లా హోంగార్డు యూనిట్ నందు హోంగార్డు గా జిల్లా ఎస్పీ నియమిస్తూ నియామక పత్రాన్ని ఈ దినం ఆయన చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ మరణించిన హోంగార్డుల కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, సుదీర్ఘ కాలంగా అంకిత భావంతో విధులు నిర్వహిస్త మరణించడం బాధాకరమని, ఏటువంటి సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చునని, పోలీసు శాఖ మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. హోంగార్డుగా నియానిక పత్రం అందుకున్న ఉదయ కుమారితో మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, వృత్తి నైపుణ్యం పెంచుకొని అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు డీఎస్పీ ఎల్.శేషాద్రి,డిపిఓ ఏ.ఓ. సి హెచ్ గోపీ నాథ్,ఆర్ఎస్ఐ వెంకట రమణ, క్లర్క్ రామ కృష్ణ , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.







