Mahaa Daily Exclusive

  గర్భిణీ ఆరోగ్యంపై అంకిత భావంతో పనిచేయాలి – జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు

Share

గర్భిణీల ఆరోగ్య శ్రేయస్సే ద్యేయంగా అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. తాడికొండ పిహెచ్సీ బుధవారం సందర్శించి ఆసుపత్రిలో వైద్య సేవల తీరు పరిశీలించారు. పిఎంఎస్ఎంఎ కార్యక్రమంలో గర్భిణీలకు నిర్వహించిన ఆరోగ్య తనిఖీలు,పరీక్షల వివరాలు,హీమోగ్లోబిన్  శాతం నివేదికలు పరిశీలించారు. గర్భిణీలతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.పలు ఆరోగ్య సూచనలు,సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రక్తహీనత గా గుర్తించిన మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన 10 మంది గర్భిణీలను డిఎంహెచ్ఓ దత్తత తీసుకొని వారికి పోషకాహార కిట్లు అందజేశారు. ప్రతీ రెండు వారాలకు వారి హీమోగ్లోబిన్ శాతం,ఆరోగ్య వివరాలు స్వయంగా  పరిశీలించి,పర్యవేక్షణ చేస్తానని తెలియజేసారు. అలాగే వైద్యాధికారులు రక్తహీనత ఉన్న గర్భిణీ లను దత్తత తీసుకొని స్వయంగా ఆరోగ్య పర్యవేక్షణ చేయాలని పిలుపునిచ్చారు. గిరిశిఖర గ్రామాల గర్భిణీ లను ప్రసవ తేదీలకు ముందుగానే గర్భిణీ వసతి గృహాల్లో చేర్చాలన్నారు. సమిష్టి కృషి తో గర్భిణీలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. అనంతరం ఫీడెర్ అంబులెన్స్ వాహన సేవలపై ఆరా తీశారు.ఆరోగ్య తనిఖీలు పూర్తి చేసుకొని తాడికొండ పిహెచ్సీ నుండి మారుమూల స్వగ్రామానికి ఫీడేర్అంబులెన్స్ లో వెళుతున్న గర్భిణీ ఆరోగ్య స్థితిని మార్గ మధ్యమంలో ఆయన పరిశీలించారు.అనంతరం తోలుఖర్జ గ్రామంలో ప్రాథమిక పాఠశాల సందర్శించి విద్యార్థుల ఆరోగ్య వివరాలపై అడిగి తెలుసుకొని డీవార్మింగ్ డే జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ బుద్దేశ్వరరావు,డాక్టర్ అభిలాష్, డిఎస్ఓ శంకర్, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.