అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు ఎన్.హిమప్రభ, ప్రాజెక్టు కార్యదర్శి బి. అమరవేణి పేర్కొన్నారు. ఐసిడిఎస్ పీవోకు వినతిపత్రం బుధవారం అందించారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలన్నారు. సర్వీసులో ఉన్న వారికి దహన సంస్కార ఖర్చులకు రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న సెంటర్ అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు.
Post Views: 133







