Mahaa Daily Exclusive

  వారంలో నివేదిక ఇవ్వండి: సీఎం రేవంత్

Share

ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. స్థలాల గుర్తింపుపై వారంలో నివేదిక అందించాలని, త్వరగా స్థలాలు గుర్తించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న స్థలాలు స్కూళ్లకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. 105 నియోజకవర్గాల్లో రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం విద్యాశాఖపై సమీక్షలో స్పష్టం చేశారు.