అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లెలో ఓ యువతి తలపై కత్తితో పొడిచి ముఖంపై యాసిడ్ పోసి విచక్షణా రహితంగా గాయపరిచిన ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. దాడి చేసిన నిందితుడ్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ అమ్మాయి చావు బ్రతుకుల మధ్య ఉందని, రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టమని సీఎం హెచ్చరించారు. నేరస్థుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని, గంజాయి, డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం పేర్కొన్నారు.
Post Views: 65







