Mahaa Daily Exclusive

  మోదీని సీఎం రేవంత్ అవమానించారు: బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Share

ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ కులగణన సర్వే గందరగోళంలో పడిందన్నారు. సర్వేలో జనాభా ఎందుకు తగ్గింది అని ప్రశ్నించారు. కులగణన సర్వేతో బీసీలకు న్యాయం జరగదని పాయల్ శంకర్ పేర్కొన్నారు. కాగా, కులగణన ప్రజేంటేషన్ సందర్భంగా రేవంత్ మోదీపై చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.